బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ అరుదైన రికార్డు!
Add ap7am to your home Screen

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ అరుదైన రికార్డు!

  • ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న రెండో భారతీయుడు
  • బిగ్‌బీని అనుసరిస్తున్న నాలుగు కోట్ల మంది
  • ఐదు కోట్ల మందితో తొలి స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ
బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, దాదాసాహెబ్‌పాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్‌ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్‌లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న రెండో భారతీయ ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. ఐదు కోట్ల మంది ఫాలోవర్లతో తొలి స్థానంలో ప్రధాని నరేంద్రమోదీ ఉండగా నాలుగు కోట్ల మంది ఫాలోవర్లతో బిగ్‌ బీ ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నారు.

అంతేకాదు అమితాబ్‌ను ఫేస్‌బుక్‌లో 2 కోట్ల 79 లక్షల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి 42 లక్షల మంది అభిమానులు ఫాలో అవుతుండడం విశేషం. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ కూడా అత్యంత వేగంగా 4 కోట్ల మంది అభిమానుల క్లబ్ కు చేరువవుతున్నారు. ప్రస్తుతానికైతే బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్ ఖాన్ 3 కోట్ల 94 లక్షల మంది ఫాలోవర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. అక్షయ్ కుమార్ 3 కోట్ల 37 లక్షల మంది ఫాలోవర్లతో తర్వాత స్థానంలో ఉన్నారు.
Bollywood
Amitabh Bachchan
twitter followers
second position
Narendra Modi

More Telugu News