Karnataka: తల్లిని చాకుతో పొడిచి చంపిన కూతురు... కర్ణాటకలో కలకలం!

షార్ట్స్‌లో చూడండి
కన్నతల్లి అన్న కనీస కనికరం కూడా లేకుండా, తనకు అడ్డు తగులుతోందన్న ఆగ్రహంతో ఓ యువతి, క్రూరాతి కూరంగా అమ్మను హత్య చేసింది. కలకలం రేపిన ఈ ఘటన బెంగళూరు, కేఆర్ పురంలోని అక్షయనగర్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన నిర్మల (55), తన కుమారుడు, కుమార్తె అమృతలతో కలిసి అక్షయ నగర్ లో నివాసం ఉంటోంది.

ఈ క్రమంలో తన తల్లితో నిత్యమూ గొడవలు పడుతూ ఉండే అమృత, ఆదివారం జరిగిన వాగ్వాదంతో తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆపై నిర్మల తన గదిలోకి వెళ్లి నిద్రపోగా, అప్పటికే కోపంతో ఉన్న అమృత, ఓ చాకును తీసుకుని వెళ్లి, తల్లిని దారుణాతి దారుణంగా పొడిచి, హత్య చేసి పరారైంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న కుమారుడు కూడా పరారయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న కేఆర్ పురం పోలీసులు, ఘటనా స్థలిని సందర్శించి కేసు నమోదు చేసి, అమృత కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Karnataka
Amrutha
Murder
Police

More Telugu News