మేం బీజేపీని ఏమడిగాం.. ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం.. అంతేకదా!: ఉద్ధవ్ థాకరే
- సామ్నా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఉద్ధవ్
- ఇతర పార్టీలతో పొత్తు అనైతికం కాదని వ్యాఖ్యలు
- బీజేపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదా? అంటూ నిలదీత
"అయినా మేం బీజేపీని ఏం అడిగాం... నింగి నుంచి చంద్రుడ్ని తీసుకురమ్మన్నామా? లేక చుక్కల్ని తీసుకురమ్మన్మామా?... మా తండ్రి గారి కోరిక మేరకు ఓ శివసైనికుడ్ని సీఎం చేయమని అడిగాం" అంటూ బీజేపీపై విమర్శలు చేశారు. ఎన్నికలు పూర్తయిన వెంటనే బీజేపీ తన మాట నిలబెట్టుకుని ఉంటే ఇవాళ తన స్థానంలో మరో శివ సైనికుడు సీఎం అయ్యుండేవాడని తెలిపారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీఎం పీఠం వద్ద సయోధ్య కుదరక శివసేనకు బీజేపీ దూరమైన సంగతి తెలిసిందే. ఆపై శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.