టీమిండియా, కివీస్ ఆటగాళ్ల మధ్య స్నేహానికి ఈ ఫొటోనే నిదర్శనం!
- చివరి టి20లో ఆడని కోహ్లీ, విలియమ్సన్
- బౌండరీ లైన్ వద్ద కబుర్లు
- క్లిక్ మనిపించిన కెమెరామన్
ఈ సిరీస్ కు ముందు కోహ్లీ మాట్లాడుతూ, వరల్డ్ కప్ లో ఓటమిని ఆ మ్యాచ్ వరకే పరిమితం చేశామని, ఇప్పుడు కివీస్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచనే రాదని, కివీస్ ఆటగాళ్లు చాలా మంచివాళ్లని కితాబిచ్చాడు. ఇప్పుడు మౌంట్ మాంగనుయ్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ బౌండరీ లైన్ వద్ద అడ్వర్టయిజ్ మెంట్ బోర్డుకు ఆనుకుని కూర్చుని ఉండగా, అటూఇటూ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఓ మీడియా కెమెరామన్ ఫొటో తీశాడు.