‘హెల్మెట్’ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించిన ఎల్బీనగర్ పోలీసులు
- కొనసాగుతున్న 31వ రోడ్డు భద్రతా వారోత్సవాలు
- వాహనచోదకుడు, వెనుక వ్యక్తి హెల్మెట్లు ధరిస్తూ ఆఫర్
- ఉచితంగా ఒక లీటర్ పెట్రోల్ కూపన్లు
ఈ సందర్భంగా ఏఎస్ఐ అంజపల్లి నాగమల్లు మాట్లాడుతూ, ప్రతి ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇందులో లక్షా యాభై వేల మంది వరకు చనిపోతున్నారని చెప్పారు. హెల్మెట్ ధరించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయని, అధిక శాతం మంది మృతి చెందుతున్నారని అన్నారు. దీనిని అరికట్టాలన్న ఉద్దేశంతోనే ఈ తరహా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టామని, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వాహనచోదకులకు వివరించినట్టు చెప్పారు.