మైదానంలో 'భారత్ మాతాకీ జై' అంటూ నినదించిన న్యూజిలాండ్ అభిమాని.. వీడియో వైరల్
- రెండో టీ20 మ్యాచ్‌లో ఘటన
- తనకు ఈ నినాదాన్ని నేర్పించాలని అడిగిన న్యూజిలాండ్ అభిమాని
- నేర్పించిన భారతీయులు
ఈ నేపథ్యంలో ఓ న్యూజిలాండ్ అభిమాని కూడా 'భారత్ మాతా కీ జై' అంటూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. 'భారత్ మాతా కీ జై' అనే నినాదాన్ని తనకు నేర్పించాలని కివీస్ అభిమాని భారతీయులను అడిగాడు. దీంతో అతడికి ఈ నినాదం ఎలా పలకాలన్న విషయాన్ని భారతీయులు నేర్పించారు. దీంతో అతడు 'భారత్ మాతా కీ జై' అని నినదించాడు.