పేదల ఇళ్ల స్థలాల కోసం విశాఖలో ల్యాండ్ పూలింగ్... విధివిధానాలు ఖరారు చేసిన ప్రభుత్వం
- అమరావతి తరహా ల్యాండ్ పూలింగ్
- 10 మండలాల్లో 6,116.5 ఎకరాలు సేకరించాలని నిర్ణయం
- అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజి
భూములకు ఎకరాకు 900 గజాలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. పదేళ్లకు పైగా ఆక్రమణలో ఉంటే 450 గజాలు, 5 నుంచి పదేళ్లలోపు ఆక్రమణలో ఉన్న భూమికి 250 గజాలు ఇస్తామని చెబుతోంది. ఇక, అభివృద్ధి చేసిన భూమిలో ఖర్చుల నిమిత్తం 15 శాతం వీఎంఆర్డీఏకి ఇవ్వాలని నిర్ణయించారు.