మేకప్ వేసుకోకపోతే యాంకర్ సుమ ఇలా ఉంటుంది!
- మేకప్ వేసుకోకుండా తీసుకున్న వీడియో పోస్ట్ చేసిన సుమ
- గత రాత్రి 'క్యాష్' ప్రోగ్రామ్ లో పాల్గొన్నానన్న యాంకర్
- అభిమానుల కోసమైనా మేకప్ వేసుకొని పనిచేయాలనిపిస్తుందని వ్యాఖ్య
యూట్యూబ్‌లో పలు ప్రయోగాత్మక వీడియోలు పోస్టు చేస్తూ అలరిస్తోంది. తాజాగా ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఏ మాత్రం మేకప్ వేసుకోకుండా ఆమె కనపడి పలు విషయాలు చెప్పింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. గత రాత్రి తాను 'క్యాష్' ప్రోగ్రామ్ లో పాల్గొన్నానని, ఆ మరుసటి రోజు తాను ఇలా ఉన్నానని ఆమె చెప్పింది. ఆ ప్రోగ్రాం సందర్భంగా ఫ్యాన్స్ తనకు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి మాట్లాడింది. అభిమానుల కోసమైనా మేకప్ వేసుకొని కష్టపడి పనిచేయాలనిపిస్తుందని తెలిపింది.