ఈ విజయం సూపర్: కివీస్ పై తొలి టీ-20లో విజయంపై విరాట్ కోహ్లీ
- రెండు రోజుల క్రితమే వచ్చి..ఇక్కడి వాతావరణంలో గెలిచాం
- ప్రేక్షకుల మద్దతు మరింత ఉత్సాహాన్నిచ్చింది
- టీ20ల్లో టీమిండియా గత ఏడాది నుంచి అద్భుతంగా రాణిస్తోంది
ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు స్కోరు 230 పరుగులకు చేరుతుందని అనుకున్నామని, అయితే తమ బౌలర్లు వారి బ్యాట్స్ మెన్ కు బ్రేకులు వేసి స్కోరును 204 పరుగులకే పరిమితం చేశారని అన్నాడు. లక్ష్య ఛేదన చేస్తున్నప్పుడు.. కీలకదశలో శ్రేయస్ అయ్యర్ తన అద్భుత బ్యాటింగ్ తో కివీస్ బౌలర్లను బెంబేలెత్తించేశాడని ప్రశంసించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న శ్రేయాస్ 29 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో ఐదు బౌండరీలు, మూడు సిక్సర్లున్నాయి. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించింది.