జగన్ రెడ్డీ... నీవు పెట్టే కేసులన్నీ నాకు సన్మానమే: కేశినేని నాని
- ముగ్గురు ఎంపీల మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు
- ఈ ఘనత నీదే జగన్ రెడ్డీ
- నీవు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్టు
'అమరావతి పరిరక్షణ కోసం, రాష్ట్రం కోసం, రైతుల కోసం పోరాడుతున్న ముగ్గురు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రతో పాటు తన మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ఘనత నీదే జగన్ రెడ్డి. నువ్వు ఎన్ని కేసులు పెడితే మాకు అన్ని సన్మానాలు చేసినట్లే అవుతుంది గుర్తుంచుకో' అని వ్యాఖ్యానించారు.