టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి ఇంటి ముట్టడికి వైసీపీ నేతల యత్నం.. ఉద్రిక్తత!
- వెలగపూడి ఇంటి ముట్టడికి వైసీపీ కార్యకర్తల విఫలయత్నం
- అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై బైఠాయింపు
- వెలగపూడి దిష్టిబొమ్మ దహనం
సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లే దారిని తాళ్లతో మూసివేశారు. దీంతో డబుల్ రోడ్డు మీదుగా వెలగపూడి ఇంటికి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకున్నారు. మరోవైపు, విషయం తెలిసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు వెలగపూడి నివాసానికి చేరుకుని వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాళ్లపై నుంచి దూకేందుకు ప్రయత్నించిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.