'టాక్సీవాలా' దర్శకుడితో నాని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'టాక్సీవాలా' దర్శకుడితో నాని

  • 'వి' సినిమాతో రానున్న నాని 
  • సెట్స్ పై 'టక్ జగదీశ్'
  • మైత్రీ బ్యానర్లో తదుపరి సినిమా   
నాని తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వి' సిద్ధమవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. తన కెరియర్లోనే ఈ పాత్ర ప్రత్యేకమైనదని ఆయన చెబుతున్నాడు. ఈ సినిమా తరువాత ప్రాజెక్టు అయిన 'టక్ జగదీశ్' సెట్స్ పై వుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే నాని మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

హీరో నితిన్ తో 'భీష్మ' .. 'రంగ్ దే' సినిమాలను ప్లాన్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ వారు, మరో రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో వున్నారు. వీటిలో ఒక సినిమాను నానితో చేయనున్నారు. ఈ సినిమాకి 'టాక్సీవాలా' దర్శకుడు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు. 'టక్ జగదీశ్' పూర్తికాగానే నాని ఈ కొత్త ప్రాజెక్టు పైకి వచ్చేస్తాడని అంటున్నారు. ఇందులో నాయిక ఎవరన్నది తెలియాల్సి వుంది.
Nani
Rahul

More Telugu News