Posani: బాలకృష్ణకి కోపం ఎక్కువే .. కానీ దానికో కారణం వుంటుంది: పోసాని

షార్ట్స్‌లో చూడండి
రచయితగా .. దర్శకుడిగా .. నటుడిగా పోసాని కృష్ణమురళికి ప్రత్యేకమైన స్థానం వుంది. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతుండగా, బాలకృష్ణ గురించిన ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. బాలకృష్ణ గారి సినిమాలకి నేను రచయితగా పనిచేశాను .. ఆయనతో కలిసి రెండు మూడు సినిమాల్లోను నటించాను. ఆయనకి కోపం ఎక్కువనే మాట నిజమే .. కానీ ఆ కోపానికి ఓ కారణం ఉంటుంది.

కావాలని ఆయన ఎవరినీ ఏమీ అనరు. తనకి అనిపించింది ముఖాన్నే చెప్పేస్తారు .. మనిషి ముందు ఒక మాట .. తరువాత ఒకమాట ఆయనకి తెలియదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆయన సమానంగానే చూస్తారు. తన తోటివారికి ఏదైనా సమస్య వుంటే పట్టించుకుంటారు. అవినీతి .. అక్రమాలు అనేవి ఆయనకి అసలే తెలియదు. రామారావుగారి కుమారుడే అయినా, కష్టపడి పైకొచ్చారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
Posani
Balakrishna

More Telugu News