Buddhavenkanna: అందుకే మూడు రాజధానుల పేరుతో జగన్ స్కెచ్ వేశాడు: బుద్ధా వెంకన్న

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. 'తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొట్టేసిన లక్ష కోట్ల రూపాయలు ఏదో ఒక రోజు జప్తు అవుతుందనే భయం జగన్ గారిని వెంటాడుతోంది. అందుకే మరోసారి విజయసాయిరెడ్డి గారిని రంగంలోకి దింపి మూడు రాజధానుల పేరుతో మూడు లక్షల కోట్లు దొబ్బేయడానికి స్కెచ్ వేశాడు. విశాఖలో భూ దందా మొదలైంది' అని ఆరోపణలు చేశారు.

'ప్రజలకు పండుగలు లేకుండా చేసి, రైతులను బలి తీసుకుంటూ జగన్ గారు రాక్షస ఆనందం పొందుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అయితే 10 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు విజయసాయి రెడ్డి గారు' అని బుద్ధా వెంకన్న ట్వీట్లు చేశారు.

'అంత సంపద వస్తే అందులో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని అభివృద్ధి చెయ్యడానికి మీకు ఉన్న అభ్యంతరం ఏంటి? దళిత రైతులను దెబ్బకొట్టి ఏం సాధించాలి అనుకుంటున్నారు?' అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.
Go Back to Shorts
Buddhavenkanna
YSRCP
Telugudesam
Jagan

More Telugu News