ఆసీస్ పై లెక్క సరిచేసిన టీమిండియా... రాజ్ కోట్ వన్డేలో విజయం!
- తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత్
- రెండో వన్డేలో 36 పరుగులతో విక్టరీ
- 341 పరుగుల లక్ష్యఛేదనలో 304 పరుగులకే ఆలౌటైన ఆసీస్
రెండు వికెట్లు సాధించడం ద్వారా కుల్దీప్ యాదవ్ మ్యాచ్ ను మలుపుతిప్పగా, షమీ (3), సైనీ (2), జడేజా (2) సమయోచితంగా రాణించి జట్టు విజయంలో పాలుపంచుకున్నారు. ఈ విజయంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే జనవరి 19 ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.