ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన కుల్దీప్ యాదవ్

  • ఆసీస్ లక్ష్యం 341 పరుగులు
  • 40 ఓవర్లలో 5 వికెట్లకు 235పరుగులు చేసిన ఆసీస్
  • స్మిత్,  వికెట్లు తీసిన కుల్దీప్
టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య రాజ్ కోట్ లో జరుగుతున్న రెండో వన్డే ఆసక్తికరంగా సాగుతోంది. స్టీవ్ స్మిత్ (98), లబుషేన్ (46) పోరాడడంతో లక్ష్యఛేదనలో ముందుకు సాగుతున్నట్టు అనిపించిన ఆసీస్ ను కుల్దీప్ యాదవ్ దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్లో స్మిత్, అలెక్స్ కేరీలను పెవిలియన్ చేర్చి భారత్ విజయావకాశాలను సజీవంగా నిలిపాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 40 ఓవర్లలో 5 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 60 బంతుల్లో 106 పరుగులు చేయాలి. టాపార్డర్ బ్యాట్స్ మెన్ అందరూ పెవిలియన్ చేరిన నేపథ్యంలో 341 పరుగుల లక్ష్యాన్ని కంగారూ లోయరార్డర్ ఎంతవరకు ఛేదిస్తుందన్నది సందేహమే! ప్రస్తుతం అస్టన్ టర్నర్, అగర్ క్రీజులో ఉన్నారు.
Go Back to Shorts
India
Australia
Rajkot
ODI
Cricket
kuldeep Yadav

More Telugu News