ఫ్లాటు తరువాతనే బెంజ్ కారు కొన్నాను: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్లాటు తరువాతనే బెంజ్ కారు కొన్నాను: 'బిగ్ బాస్ 3' విజేత రాహుల్

  • సింగర్ గా రాహుల్ కి మంచి క్రేజ్ 
  • 'బిగ్ బాస్ 3' విజేతగా గుర్తింపు 
  • తలిదండ్రుల ముచ్చట తీర్చానన్న రాహుల్ 
రాహుల్ సిప్లి గంజ్ కొంతకాలంగా సినిమాల్లో పాటలు పాడుతున్నప్పటికీ, 'రంగస్థలం' టైటిల్ సాంగ్ తోనే ఆయనకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఆయన 'బిగ్ బాస్ 3' విజేతగా నిలవడంతో పాప్యులారిటి పెరిగింది. తను బిగ్ బాస్ 3 విజేతగా నిలిస్తే, వచ్చే డబ్బుతో తల్లిదండ్రుల కోసం ఒక ఫ్లాట్ తీసుకుంటానని ఆయన చెప్పాడు.

అయితే తాజాగా ఆయన 50 లక్షల ఖరీదు చేసే బెంజ్ కారు కొనేసి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో సొంత ఇల్లు తీసుకుంటానని చెప్పి .. ఖరీదైన కారు తీసుకుంటావా? అంటూ ఆయనను నెటిజన్లు ప్రశ్నించారు. రాహుల్ మధ్యతరగతి కుటుంబం నుంచి రావడం వలన ఆయన పట్ల ప్రేమతోనే నెటిజన్లు అలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందుకు రాహుల్ స్పందిస్తూ .."ఆల్రెడీ ఫ్లాట్ తీసేసుకున్నాను .. అది చేతికి రావడానికి ఏడు నెలలు పడుతుంది. ఈలోగా కారుకి కూడా గాలమేశాను" అంటూ నెటిజన్లను కూల్ చేశాడు.
Rahul

More Telugu News