అరెస్టులను నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన పంచుమర్తి అనురాధ
- అవనిగడ్డ, విజయవాడ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు
- తోట్లవల్లూరు కరకట్టపై టీడీపీ కార్యకర్తల ధర్నా
- రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత
ఈ నేపథ్యంలో పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ, లోకేశ్ ను ఏ కారణంతో అరెస్ట్ చేశారో పోలీసులు, ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. గద్దె రామ్మోహన్ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన లోకేశ్ ను కారెక్కనివ్వకుండా అడ్డుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం దారుణమని అన్నారు. విజయవాడలో జరిగిన దీక్షకు వెళితే అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారని మండిపడ్డారు.