నారా లోకేశ్ అరెస్ట్.. మరో ముగ్గురు నేతలు కూడా!
- లోకేశ్ తో పాటు ఎమ్మెల్యే రామానాయుడు అరెస్ట్
- తోట్లవల్లూరు వైపు తీసుకెళ్తున్న పోలీసులు
- మండిపడుతున్న టీడీపీ శ్రేణులు
లోకేశ్ తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న టీడీపీ నేత, ఎమ్మెల్యే రామానాయుడును, మరో ఇద్దరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. అయితే, వీరిని కలెక్టరేట్ మీదుగా తోట్లవల్లూరు వైపు తీసుకెళ్లారు. మరోవైపు, టీడీపీ శ్రేణులు ఈ అంశంపై మాట్లాడుతూ, పార్టీ ఆఫీసుకు వెళ్తున్నానని లోకేశ్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినకుండా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.