ఇంట్లో చెప్పకుండా వచ్చానన్న మహిళ... భర్తకు ఫోన్ చేసి ఏమీ అనవద్దని కోరిన చంద్రబాబు... వీడియో ఇదిగో!
- గద్దె రామ్మోహన్ దీక్షకు చంద్రబాబు సంఘీభావం
- తన భర్త ఏమైనా అంటారేమోనని భయపడిన నాగలక్ష్మి
- ఫోన్ చేసి, భర్తతో మాట్లాడిన చంద్రబాబు
ఆ వెంటనే స్పందించిన చంద్రబాబు, ఫోన్ నంబర్ రాసివ్వాలని కోరి, వెంటనే చంద్రశేఖర్ కు ఫోన్ చేశారు. హలో బ్రదర్... నేను చంద్రబాబునాయుడిని అంటూ పరిచయం చేసుకున్నారు. ఇక్కడ ఓ మీటింగ్ కు నాగలక్ష్మి వచ్చారని, మీ పర్మిషన్ లేకుండా వచ్చారని, దీక్షకు సంఘీభావాన్ని తెలిపారని అన్నారు. ఇంతవరకూ తాను భర్త అనుమతి లేకుండా ఎన్నడూ గడప దాటింది లేదని, మొదటిసారి ఆమె ఎమోషన్ లో వచ్చారని, ఓ ఉంగరాన్ని ఉద్యమానికి ఇచ్చారని, మనస్ఫూర్తిగా ఆమెను ఆశీర్వదించి, సహకరించాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూడవచ్చు.