ముక్కోటి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, చంద్రబాబు
- నేడు వైకుంఠ ఏకాదశి
- ట్విట్టర్ లో స్పందించిన సీఎం జగన్
- వైకుంఠ ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులకు సమానం అన్న చంద్రబాబు
అటు, విపక్ష నేత చంద్రబాబునాయుడు కూడా ట్విట్టర్ లో స్పందించారు. వైకుంఠ ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశులకు సమానమైనదని తెలిపారు. అలాంటి పర్వదినంలో విశిష్ట పూజలు నిర్వహిస్తున్న ప్రజలందరికీ ఆ మహావిష్ణువు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.
అలాగే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. 'మీ పూజలు ఫలించి, మీ ఇంటిల్లిపాదికీ ఆ శ్రీహరి సుఖశాంతులను ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశారు.