KCR: మంత్రి పదవులు ఊడిపోతాయ్.. జాగ్రత్త: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
10 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలను మనమే గెలుస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమాగా చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. ఇదే సమయంలో మంత్రులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఒక్క మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఓడినా మంత్రి పదవులు పోతాయని హెచ్చరించారు.

టీఆర్ఎస్ కు బీజేపీ పోటీ అనే అపోహలు వద్దని కేసీఆర్ అన్నారు. మనకు ఎవరితోనూ పోటీ లేదని చెప్పారు. నియోజకవర్గాల్లో పార్టీ కేడర్ తో ఆత్మీయ సమావేశాలను నిర్వహించాలని సూచించారు. పాత, కొత్త నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగాలని చెప్పారు. పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని... అవసరమైన చోట మంత్రులు ప్రచారం చేస్తారని తెలిపారు.
Go Back to Shorts
KCR
TRS

More Telugu News