మహారాష్ట్ర మంత్రుల్లో 27 మందిపై క్రిమినల్ కేసులు!
- 18 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు
- 42 మంత్రుల్లో 41 మంది మంత్రులు కోటీశ్వరులు
- మంత్రివర్గంలో కేవలం ముగ్గురే మహిళా మంత్రులు
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీ పేర ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వంలో 42 మంత్రుల్లో 41 మంది మంత్రులు కోటీశ్వరులను నివేదిక తెలిపింది. మంత్రివర్గంలో కేవలం ముగ్గురే మహిళా మంత్రులున్నారని పేర్కొంది. విద్య విషయానికి వస్తే.. 22 మంది మంత్రులు గ్రాడ్యుయేట్లని, 18 మంది మంత్రులు 8 నుంచి 12వ తరగతి మాత్రమే చదివారని స్పష్టం చేసింది. కాగా, 17 మంది మంత్రులు 25 నుంచి 50 ఏళ్ల లోపు వయసు వారని, 25 మంది మంత్రుల వయసు 50 నుంచి 80 ఏళ్ల లోపు ఉంటుందని నివేదిక వెల్లడించింది.