Tollywood: సినీ ప్రముఖులు ఏపీ రాజధానిపై స్పందించాలి.. లేదంటే 3 రోజులు థియేటర్లు బంద్: కాంగ్రెస్ అల్టిమేటం

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సినీ ప్రముఖులు స్పందించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ నెల 10వ తేదీ లోపు సినీ ప్రముఖులు స్పందించాలని, లేదంటే సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజులు థియేటర్ల బంద్‌కు పిలుపునిస్తామని అల్టిమేటం జారీ చేసింది. దీనిపై ఇప్పటివరకు సినీ ప్రముఖులు స్పందించలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది.

కొన్ని రోజుల క్రితం రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనను మెగాస్టార్ చిరంజీవి స్వాగతించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ చేసిన హెచ్చరికకు ఇతర సినీ ప్రముఖులు స్పందిస్తారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలు నిన్న మా డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో వారి ముందు మరో సమస్య నిలవడం గమనార్హం. 
Go Back to Shorts
Tollywood
Congress
Amaravati

More Telugu News