రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘మహా’ శకటానికి దక్కని చోటు.. బీజేపీ కుట్రలు చేస్తోందన్న శివసేన
- రిపబ్లిక్ డే పరేడ్‌లో మహారాష్ట్ర, బెంగాల్ శకటాలకు దక్కని చోటు
- ఇది మహారాష్ట్రకు జరిగిన అవమానం
- ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనిపై విచారణ జరిపించాలి
మహారాష్ట్ర శకటాన్ని జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ తయారు చేస్తుందని, రాష్ట్ర శకటం పలుమార్లు అవార్డులు కూడా దక్కించుకుందని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. కానీ ఈసారి మాత్రం పరేడ్‌కు అర్హత సాధించకపోవడం వెనక కారణం.. రాష్ట్రంలో మహా అఘాడి ప్రభుత్వం ఏర్పడడమేనని అన్నారు. మహారాష్ట్ర శకటానికి పరేడ్ అర్హత దక్కకపోవడం అన్నది రాష్ట్రానికే జరిగిన అవమానమని రౌత్ అన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే దీనిపై విచారణ చేపట్టాలని సంజయ్ రౌత్ కోరారు.