Dhanush: కోలీవుడ్ ను ఊపేస్తున్న 'జిగిడీ కిల్లాడి' సాంగ్

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో వరుస విజయాలతో ధనుశ్ దూసుకుపోతున్నాడు. కథాకథనాలపైనే కాదు, సంగీతం విషయంలోను ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఉంటాడు. యూత్ ను .. మాస్ ఆడియన్స్ ను ఊపేసే బీట్ కి ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. గతంలో ధనుశ్ .. అనిరుధ్ కాంబినేషన్లో వచ్చిన 'కొలవెరి' పాట అన్నివర్గాల ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. రీసెంట్ గా వాళ్లిద్దరూ అదే తరహా పాటను వదిలారు.

తమిళంలో ధనుశ్ 'పటాస్' అనే సినిమా చేస్తున్నాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. అనిరుధ్ పాడిన ఈ పాట ఇప్పుడు కోలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోంది. 'జిగిడీ కిలాడి' అంటూ సాగే ఈ పాట, తెరపై ఏ స్థాయిలో సందడి చేస్తుందో చూడాలి. ఒక కీలకమైన పాత్రలో స్నేహ నటిస్తున్న ఈ సినిమాను, జనవరి 16వ తేదీన విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Dhanush
Mehreen
Sneha

More Telugu News