Maharashtra: యువతిని కిడ్నాప్ చేసి ఏడాదిన్నరగా సామూహిక అత్యాచారం!

షార్ట్స్‌లో చూడండి
ఓ యువతిని కిడ్నాప్ చేసిన 11 మంది దుండగులు ఆమెపై గత ఏడాదిన్నరగా అత్యాచారం జరిపిన ఘటన తాజాగా వెలుగుచూసింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలోని వాసాయ్ తాలూకాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఒక పక్క నిర్భయ, దిశ వంటి చట్టాలు చేస్తోన్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఆ వివరాలలోకి వెళితే, 21 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్న ఓ వ్యక్తి.. ఆమెపై తొలుత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరికొందరితో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఓ చోట నిర్బంధించి మళ్లీ ఆమెపై దారుణానికి ఒడిగట్టాడు. అతడితో పాటు మిగతా వాళ్లు కూడా ఆమెను శారీరకంగా హింసించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  

ఈ క్రమంలో ఆ యువతి  బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయినా ఆ దుండగులు ఆమెపై అత్యాచారాలు కొనసాగించారు. ఈ నెలలో వారి చెర నుంచి తప్పించుకున్న యువతి కుటుంబ సభ్యుల చెంతకు చేరి జరిగినదంతా వివరించింది. అనంతరం వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. 11 మంది నిందితులపై కిడ్నాప్, రేప్, హింస కేసులు నమోదు చేశామని మీడియాకు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని.. నిందితులను ఇంకా అరెస్టు చేయలేదని అన్నారు.
Go Back to Shorts
Maharashtra
Women kidnapped
have raped for one and Half year

More Telugu News