ఉల్లిగడ్డలు చోరీ చేసి.. కిలో రూ.10 చొప్పున విక్రయించిన దొంగలు!
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన
- గోదాములో 12 బస్తాల ఉల్లి చోరీ
- పోలీసు కస్టడీలో నిందితులు
దేశ వ్యాప్తంగా ఉల్లి కిలో రూ.100కు దాటితే ఈ దొంగలు మాత్రం రూ.10కే విక్రయిస్తుండడంతో స్థానికులు ఎగబడ్డారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.