'దిశ' నిందితుల మృతదేహాల రీపోస్టుమార్టం వీడియో, నివేదిక హైకోర్టుకు అందజేత
- నిన్న రీపోస్టుమార్టం పూర్తి
- ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ప్రత్యేక వైద్య బృందం
- రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదిక కూడా హైకోర్టుకు అందజేత
ఈ రోజు ఆ రీపోస్టుమార్టం వీడియో హైకోర్టుకు చేరింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ప్రత్యేక వైద్య బృందం రీపోస్టుమార్టం ప్రాథమిక నివేదికను కూడా హైకోర్టు రిజిస్ట్రార్‌కు అందజేసింది. మరో వారం రోజుల్లో రీపోస్టు మార్టంకు సంబంధించిన సమగ్ర నివేదికను అందించనున్నారు. ఈ నెల 6న షాద్‌నగర్ శివారు చటాన్‌పల్లి వద్ద దిశ నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.