అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ధిక్కరిస్తున్న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు.. అసలు కారణం ఇదే!
- డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన డ్యుటెర్టే
- డ్రగ్స్ సరఫరాదారులపై కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు
- కుప్పలుతెప్పలుగా కాల్చి చంపిన పోలీసులు
- అంతర్జాతీయ న్యాయస్థానం ఆగ్రహం
ఈ పరిస్థితి ఫిలిప్పీన్స్ మానవ హక్కుల సంఘాలతో పాటు, అంతర్జాతీయ సమాజాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం ప్రాథమిక విచారణ జరిపింది. దాంతో అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి ఫిలిప్పీన్స్ తప్పుకుంటున్నట్టు అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రక్రియకు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అయినా స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందిస్తూ, తనను ఉరితీసినా సరే, జైలుశిక్ష విధించినా సరే అంతర్జాయ చట్టాలకు తలొగ్గేది లేదని, అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానానికి జవాబు చెప్పేది లేదని స్పష్టం చేశారు.