బన్నీ టైటిల్ కోసం ప్రయత్నిస్తున్న బోయపాటి?
- బాలకృష్ణకి రెండు భారీ హిట్లు ఇచ్చిన బోయపాటి
- మూడో సినిమాకి సన్నాహాలు
- టైటిల్ కోసం 'దిల్' రాజుతో చర్చలు
ఈ సినిమాలోను బాలకృష్ణ పాత్రను బోయపాటి చాలా పవర్ఫుల్ గా మలిచాడట. కథను .. బాలకృష్ణ పాత్రను దృష్టిలో పెట్టుకుంటే 'ఐకాన్' అనే టైటిల్ కరెక్ట్ గా ఉంటుందని బోయపాటి భావించినట్టుగా సమాచారం. ఈ టైటిల్ 'దిల్' రాజు దగ్గర వుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా ఆయన ఈ టైటిల్ తో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అందువలన బోయపాటి ఆ టైటిల్ కోసం 'దిల్' రాజును ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.