ఆఫ్రికాలోనూ 'ప్రతిరోజూ పండగే'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆఫ్రికాలోనూ 'ప్రతిరోజూ పండగే'

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • బలమైన పాత్రలతో సాగే కథనం 
  • ఈ నెల 20వ తేదీన భారీస్థాయి విడుదల
సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజూ పండగే' రూపొందింది. గ్రామీణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య పెనవేసుకున్న ప్రేమానురాగాల చుట్టూ తిరిగే కథ ఇది. రాశి ఖన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు.

అదే విధంగా ఆఫ్రికాలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ప్రైడ్ సినిమా వారు ఈ సినిమాను అక్కడ పెద్ద స్థాయిలో విడుదల చేస్తున్నారు. సత్యరాజ్ .. విజయ్ కుమార్ .. రావు రమేశ్ .. మురళీ శర్మ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. గతంలో సాయిధరమ్ తేజ్ .. రాశి ఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి.
Sai Dharam Tej
Rasi Khanna
Sathya Raj

More Telugu News