శబరిమల వెళ్లే మహిళలకు రక్షణ కల్పించాలన్న పిటిషన్లపై సుప్రీంలో విచారణ
- గత తీర్పుపై స్టే లేదన్న సుప్రీం
- ఇప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టీకరణ
- తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు పోలీసు భద్రత
ఫాతిమా, అమిని అనే మహిళలు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ, రివ్యూ పిటిషన్లపై త్వరలోనే విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేస్తామని తెలిపింది. మహిళల ప్రవేశంపై గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే లేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, గత తీర్పుపై స్టే లేనందున మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతున్నామని విజ్ఞప్తి చేశారు. దాంతో, సీజేఐ అందుకుని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, తదుపరి విచారణ వరకు పిటిషనర్లకు పోలీసు భద్రత కల్పించాలని సుప్రీం ఆదేశించింది.
ఇంతకుముందు, శబరిమలకు మహిళలు వెళ్లే అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల వెళ్లొచ్చని స్పష్టం చేసింది.