Madhya Pradesh: భార్యను మళ్లీ పెళ్లి చేసుకుని.. అదే సమయంలో ఆమె సోదరి మెడలో తాళి కట్టిన ప్రబుద్ధుడు

షార్ట్స్‌లో చూడండి
35 ఏళ్ల ఓ వ్యక్తి తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయంలో ఆమె సోదరి మెడలో కూడా తాళి కట్టాడు. మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, నవంబర్ 26న ఈ పెళ్లిళ్లు జరిగాయి. గుడావలి గ్రామ సర్పంచ్ గా ఉన్న దిలీప్ అనే వ్యక్తి 28 ఏళ్ల తన భార్య వినీతను మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇదే సమయంలో 22 ఏళ్ల రచన (వినీతకు సోదరి వరుస)కు మూడు ముళ్లు వేశాడు. దిలీప్, వినీతలకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.

ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ, తన భార్య వినీతకు ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. పిల్లలను చూసుకోవడానికి తనను మరో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరిందని చెప్పాడు. ఆమె కోరిక మేరకే తాను రచనను పెళ్లి చేసుకున్నానని తెలిపాడు. వినీతను మరోసారి పెళ్లిచేసుకోవడం కూడా ఆమె కోరిక మేరకే జరిగిందని చెప్పాడు.
Go Back to Shorts
Madhya Pradesh
Marriage

More Telugu News