వివాదరహిత నేతలే పీసీసీ చీఫ్ అవుతారు: జగ్గారెడ్డి
- జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదారహితులు
- పార్టీకి ఎన్నికోట్ల రూపాయలిచ్చినా అధిష్ఠానం పదవి ఇవ్వదు
- వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుంది
తాజాగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ లో జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులే వివాదరహితులన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుపెడతామన్నప్పటికీ అధిష్ఠానం పీసీసీ చీఫ్ పదవిని ఇవ్వదని చెప్పారు. వ్యక్తిగతంగా ఎవరు ఎదిగినా అది పార్టీకి మేలుచేస్తుందని అభిప్రాయపడ్డారు. 2018లో డబ్బులు తీసుకొని ఓట్లువేశామన్న భావనలో ప్రజలున్నారన్నారు. 2023లో డబ్బులు ఇవ్వకపోయినా వారు కాంగ్రెస్ కే ఓట్లు వేస్తారన్నారు.