రోజుకి 32 లీటర్ల పాల వెల్లువ... ప్రపంచ రికార్డు సృష్టించిన 'సరస్వతి'!
- లుథియానాలో అంతర్జాతీయ పోటీ
- వరుసగా మూడు రోజుల పాటు 30 లీటర్లకు పైగా పాలిచ్చిన గేదె
- దీని దూడను రూ.4.5 లక్షలకు విక్రయించిన యజమాని
సరస్వతి తన యజమానికి పాలతోనే కాకుండా తన అండాలతోనూ ఎంతో రాబడి తెచ్చిపెడుతోంది. ఇది ముర్రా జాతికి చెందిన మేలు రకం గేదె కావడంతో దీని నుంచి తయారయ్యే అండాల నుంచి కృత్రిమ పద్ధతుల్లో దూడలను ఉత్పత్తి చేస్తున్నారు. సరస్వతిని అమ్మాలంటూ రూ.51 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నా దీని యజమాని సుఖ్ బీర్ ధండా మాత్రం ససేమిరా అంటున్నారు. సరస్వతికి పుట్టిన దూడను ఇటీవలే రూ.4.5 లక్షలకు అమ్మారంటే దీని క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.