ప్రియుడితో కలిసి తండ్రి శరీరాన్ని ముక్కలుగా కోసి నదిలో పడేసిన దత్త పుత్రిక
- మహారాష్ట్రలో ఘటన
- మైనర్‌తో అమ్మాయి ప్రేమ
- హెచ్చరించడంతో ఘాతుకం
దీంతో ఆమెను బెన్నెట్ రెబెల్లో హెచ్చరించాడు. తన ప్రియుడితో కలిసి గతనెల 27న తండ్రిపై దాడి చేసి చంపేసింది. కత్తితో తండ్రి శరీర భాగాలను ముక్కలుగా కోసి, ఆ శరీర భాగాలను రెండు సంచులు, ఒక సూటుకేసులో నింపి తీసుకెళ్లి మిథి నదిలో పడేసింది.
ఆ సంచులు, సూట్ కేసుల్లో శరీర భాగాలు ఉన్న విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, చివరకు కేసును ఛేదించారు. రియాను విచారించగా మైనర్ ప్రియుడితో కలిసి తానే అతడిని హత్య చేసినట్టు అంగీకరించింది. అయితే, బెన్నెట్ రెబెల్లో తనను లైంగికంగా వేధించాడని, అందుకే తాను ఆయనను హత్య చేశానని అంటోంది. దీనిపై పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.