పెట్టుబడులు ఆకర్షిస్తూ కేటీఆర్ మంచి ఫలితాలు సాధిస్తున్నారు: హరీశ్ రావు ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెట్టుబడులు ఆకర్షిస్తూ కేటీఆర్ మంచి ఫలితాలు సాధిస్తున్నారు: హరీశ్ రావు ప్రశంసలు

  • కంపెనీ ఆర్థిక పరిస్థితి చీఫ్ ఫైనాన్స్‌ ఆఫీసర్లకే బాగా తెలుస్తుంది
  • కంపెనీలో వారే కీలకం
  • రాష్ట్ర ప్రభుత్వంలో నా బాధ్యత కూడా సీఎఫ్ వోల లాంటిదే 
పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కృషి చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నారని మంత్రి హరీశ్ రావు ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో‌ సీఐఐ నిర్వహించిన 'సీఎఫ్ వో కాంక్లెవ్ 2019' కు హాజరైన హరీశ్ రావు ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఐదేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అవార్డులు అందుకుంటోందని, తమ సర్కారు పరిశ్రమల స్థాపనకు అండగా ఉంటుందని చెప్పారు.

ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్ వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలివ్వాలని హరీశ్ రావు కోరారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి చీఫ్ ఫైనాన్స్‌ ఆఫీసర్లకే బాగా తెలుస్తుందని, కంపెనీలో వారే కీలకమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో తన బాధ్యత కూడా సీఎఫ్ వోల లాంటిదేనని చెప్పారు. పరిశ్రమలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు తొలిసారి మేళాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు
Harish Rao
KTR
Hyderabad

More Telugu News