ఓపెనర్ గా రాహుల్ దిగుతాడని భావిస్తున్నాను: వీవీఎస్ లక్ష్మణ్
- వెస్టిండీస్ తో త్వరలో సిరీస్
- మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ పై లక్ష్మణ్ స్పందన
- రాహుల్ మూడో స్థానంలో బాగా ఆడుతున్నాడని వ్యాఖ్య
- శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ శ్రేయస్ అయ్యర్ ఆడుతోన్న ఆట తీరుకు తాను మంత్ర ముగ్ధుడినయ్యానని లక్ష్మణ్ తెలిపారు. ఇటీవల బంగ్లాతో జరిగిన చివరి టీ20లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడని కొనియాడారు. టీమిండియా టాప్ ఆర్డర్ ను కోల్పోయి కష్టాల్లో పడిన సందర్భంలో పరిస్థితులను అర్థం చేసుకునే అతడు ఆడుతున్నాడని చెప్పారు. ఇటీవల అతడు పరిస్థితులకు తగ్గట్లు ఆడాడని చెప్పారు. టీమిండియాలో నాలుగో స్థానంలో అలాంటి ఆటే మనకు కావాలని ఆయన కొనియాడారు.