ఆ సాంగ్ లో నాతో పాటు పునర్నవి కూడా కనిపిస్తుంది: సింగర్ రాహుల్ సిప్లిగంజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ సాంగ్ లో నాతో పాటు పునర్నవి కూడా కనిపిస్తుంది: సింగర్ రాహుల్ సిప్లిగంజ్

  • 'బిగ్ బాస్ 3' విజేతగా నిలిచిన రాహుల్
  • బిగ్ బాస్ హౌస్ లో పునర్నవితో సాన్నిహిత్యం 
  • ఇద్దరి మధ్య లవ్ నడుస్తోందంటూ ప్రచారం
గాయకుడిగా రాహుల్ సిప్లి గంజ్ కి మంచి పేరుంది. 'బిగ్ బాస్ 3'తో ఆయన మరింత పాప్యులర్ అయ్యాడు. ఒక వైపున సినిమాలకి పాడుతూనే, మరో వైపున ప్రైవేట్ వీడియో సాంగ్స్ చేయడం రాహుల్ కి అలవాటు. అలా ఈ సారి తను చేయనున్న సాంగ్ లో పునర్నవి కూడా కనిపిస్తుందని చెప్పడం విశేషం.

'బిగ్ బాస్' హౌస్ లో వున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనల వలన, రాహుల్ - పునర్నవి ప్రేమించుకుంటున్నారనే ప్రచారం మొదలైంది. వాళ్లు బయటికి వచ్చిన తరువాత కూడా ఈ టాక్ అదే స్పీడ్ తో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ .."ఎక్కడికి వెళ్లినా మా పెయిర్ బాగుందని అంటున్నారు. మా పెయిర్ గురించే మాట్లాడుతున్నారు. అందువలన త్వరలో నేను చేయనున్న ఒక ప్రైవేట్ వీడియో సాంగ్ కోసం పునర్నవిని తీసుకుంటున్నాను. నాతో పాటు ఆమె కూడా కనిపిస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
Rahul
Punarnavi

More Telugu News