మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సరికొత్త రికార్డు
- నాలుగు రోజుల ముఖ్యమంత్రిగా రికార్డు
- మహారాష్ట్ర రాజకీయాల్లో ఇదో చరిత్ర
- అత్యల్పకాలం సీఎంగా పనిచేసిన ఫడ్నవీస్
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైన తర్వాత అకస్మాత్తుగా ఈ నెల 23న ఉదయం ఫడ్నవీస్ సారథ్యంలోని ప్రభుత్వం కొలువుదీరింది. ఉదయం 8 గంటలలోపే ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్.. ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతు లేకపోవడంతో నిన్న తన పదవికి రాజీనామా చేశారు.