మాకు అలాంటి పట్టింపులేమీ లేవు.. అందరినీ పిలుస్తాం: శివసేన
- ‘మహా’ సీఎంగా రేపు ఉద్ధవ్ ప్రమాణ స్వీకారం
- మోదీ, షాలను కూడా పిలుస్తామన్న సంజయ్ రౌత్
- నాలుగు రోజుల సీఎంగా మిగిలిపోయిన ఫడ్నవీస్
మహారాష్ట్రలో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించిన రాజకీయాలు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారంతో ఓ కొలిక్కి వచ్చాయని అందరూ భావించారు. అయితే, బలనిరూపణకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన నాలుగు రోజల ముఖ్యమంత్రిగా మిగిలిపోయారు. 23న ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు రోజులకే ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.