బాలయ్య సినిమాలో నటించబోతున్న రోజా?
- బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త చిత్రం
- నెగెటివ్ రోల్ లో సంజయ్ దత్
- పవర్ ఫుల్ లేడీ పాత్ర కోసం రోజాను సంప్రదించిన బోయపాటి
తాజాగా బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్లో కొత్త చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నెగెటివ్ రోల్ పోషించబోతున్నారు. ఇందులో ఓ పవర్ ఫుల్ లేడీ పాత్ర కూడా ఉందట. ఈ పాత్ర కోసం రోజాను బోయపాటి శ్రీను సంప్రదించగా... ఆలోచించి చెబుతానని ఆమె సమాధానమిచ్చినట్టు తెలుస్తోంది. రోజా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఇద్దరి అభిమానులకు పండగే.