Nara Lokesh: వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రసంగానికి చప్పట్లు కొట్టలేదని నిరుద్యోగుల కంటే కుక్కలు మేలు అని ఓ మంత్రి అన్నారంటూ నారా లోకేశ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగులను కుక్కలతో పోల్చడం అధికారం తెచ్చిన తలపొగరుకు నిదర్శనం అని మండిపడ్డారు. అయినా దేనికి కొట్టాలి చప్పట్లు? అని లోకేశ్ నిలదీశారు.

వైసీపీ కార్యకర్తలకు గ్రామ వలంటీర్ల పేరుతో ఉద్యోగాలు ఇచ్చి ఏడాదికి రూ.4000 కోట్ల ప్రజాధనం దోపిడీ చేస్తున్నందుకు కొట్టాలా? గ్రామ సచివాలయ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి ఒక్కో పేపర్ రూ.5 లక్షలకు అమ్ముకుని 19 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నందుకు కొట్టాలా? అంటూ నిలదీశారు. ఇదే విధంగా పరిపాలిస్తే మాత్రం నిరుద్యోగ యువతే మీ ప్రభుత్వానికి చావు డప్పు కొడుతుందని హెచ్చరించారు.
Go Back to Shorts
Nara Lokesh
YSRCP
Jagan
Telugudesam
Andhra Pradesh

More Telugu News