మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో అమిత్ షాదే కీలక పాత్ర: సుశీల్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
- అమిత్ షా అపరచాణుక్యుడిలా వ్యవహరించారు
- భారత రాజకీయాల్లో తానేంటో మరోసారి రుజువు చేసుకున్నారు
- అమిత్ షా రాజకీయ ఎత్తుగడ ఫలించింది
ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేడయంలో అమిత్ షా కీలకపాత్ర పోషించారని సుశీల్ మోదీ వ్యాఖ్యానించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన సమయంలోనే తమ పార్టీ జాతీయాధ్యక్షుడు వేసిన రాజకీయ ఎత్తుగడ తమకు సానుకూల ఫలితాన్నిచ్చిందన్నారు.