Austalian: ఆస్ట్రేలియన్ ను చితకబాదిన కర్ణాటక గ్రామస్తులు
- మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియన్
- బాదామి నుంచి బాగల్ కోట్ కు బస్సులో వస్తుండగా ఘటన
- ఆస్ట్రేలియన్ ను ఆసుపత్రికి తరలించిన పోలీసులు
ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఫుల్లుగా మందేసిన అతను ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పక్కనున్న వారు దేహశుద్ధి చేశారు. పోలీసుల కథనం ప్రకారం, అతని పేరు జేమ్స్ విలియమ్స్. అటూఇటుగా 35 సంవత్సరాల వయసు ఉంటుంది. బాదామి నుంచి బాగల్ కోట్ కు బస్సులో వస్తూ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఈ ఘటన నేపథ్యంలో అతనికి, స్థానికులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందగా... తీవ్రంగా గాయపడ్డ ఆస్ట్రేలియా పౌరుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... దాడికి పాల్పడినట్టు గుర్తించిన కొందరిని అదుపులోకి తీసుకున్నారు.