Tanvir sait: వీఐపీని హత్య చేస్తే పేరొస్తుందని పొడిచాడట!

షార్ట్స్‌లో చూడండి
కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తన్వీర్ సేట్ ను కత్తితో పొడిచిన నిందితుడు ఫర్హాన్ పాషా (24) పోలీసుల విచారణలో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడించాడు. వీఐపీని హత్య చేస్తే పేరొస్తుందన్న ఉద్దేశంతోనే ఆయనను చంపేందుకు యత్నించినట్టు చెప్పాడు. కాగా, నిందితుడిని కోర్టు పోలీసు కస్టడీకి అప్పగించింది.

రెండు రోజుల క్రితం ఫర్హాన్ తమతో మాట్లాడుతూ.. తాను ఓ వీఐపీని హత్య చేయబోతున్నట్టు చెప్పాడని, దీంతో తాము జోక్ చేస్తున్నాడని అనుకున్నామని, నిజంగానే ఇంత పని చేస్తాడని అనుకోలేదని అతడి స్నేహితులు తెలిపారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి ఈ హత్యాయత్నం జరిగిన తర్వాత ఫర్హాన్ కుటుంబం పరారైంది.

ఫర్హాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన తన్వీన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం కొంచంకొంచంగా మెరుగుపడుతోందని వైద్యులు తెలిపారు. మరోవైపు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు గాను ఎమ్మెల్యే గన్‌మెన్‌ను పోలీసు ఉన్నతాధికారులు తొలగించారు.
Go Back to Shorts
Tanvir sait
Karnataka
Bengaluru

More Telugu News