నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ కల్మషం లేని వాళ్లు: లక్ష్మీ పార్వతి
Add ap7am to your home Screen

నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ కల్మషం లేని వాళ్లు: లక్ష్మీ పార్వతి

  • ఆరోజున ‘వైస్రాయ్’ లో చంద్రబాబు నాటకాలాడారు
  • బాబు స్వార్థం కోసమే వారిని రాజకీయాల్లోకి దింపారు
  • నందమూరి ఫ్యామిలీని చంద్రబాబు సర్వనాశనం చేశాడు
నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ మంచి వాళ్లని, ఎటువంటి కల్మషం వారిలో లేదని వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సాక్షి ఛానెల్ లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పెద్దచెట్టును నాశనం చేయడానికి ఓ పురుగు చాలు, అలాగే, నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు చంద్రబాబు అని నిప్పులు చెరిగారు.

ఆ రోజున హరికృష్ణ, బాలకృష్ణలను తీసుకొచ్చి టీడీపీ అధ్యక్ష పదవి ఒకరు, ముఖ్యమంత్రి పదవి మరొకరు తీసుకోండంటూ వైస్రాయ్ హోటల్ లో చంద్రబాబు నాటకాలు ఆడారని విమర్శించారు. చంద్రబాబునాయుడు తన స్వార్థం కోసం హరికృష్ణ, బాలకృష్ణలను రాజకీయాల్లోకి దింపారని విమర్శించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణను, హరికృష్ణ కూతురు సుహాసినిని, కొడుకు జూనియర్ ఎన్టీఆర్ ను తన స్వార్థం కోసం చంద్రబాబు వాడుకుని వదిలేశారని దుయ్యబట్టారు.
Balakrishna
Chandrababu
Lakshmi parvathi

More Telugu News