Virat Kohli: ధోనీ రికార్డును అధిగమించిన కోహ్లీ

షార్ట్స్‌లో చూడండి
ఇండోర్ లో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కోహ్లీ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్ విజయాలను అందుకున్న భారత కెప్టెన్ గా అవతరించాడు. మాజీ కెప్టెన్ ధోనీ 9 ఇన్నింగ్స్ విజయాలతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్నాడు. తాజాగా 10 ఇన్నింగ్స్ విజయాలతో ధోనీని కోహ్లీ రెండో స్థానంలోకి నెట్టేశాడు. ఆ తర్వాతి స్థానంలో 8 విజయాలతో అజారుద్దీన్, 7 విజయాలతో గంగూలీ ఉన్నారు.
Go Back to Shorts
Virat Kohli
MS Dhoni

More Telugu News