Tamilnadu: తమిళనాట మరో విషాదం... అన్నాడీఎంకే జెండా కారణంగా కాళ్లు పోగొట్టుకున్న అనురాధ!

షార్ట్స్‌లో చూడండి
చెన్నైలో స్కూటీపై వెళుతూ, అధికార అన్నాడీఎంకే హోర్డింగ్ విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన శుభశ్రీ ఘటనను మరువక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. కోయంబత్తూరులోని ఓ హోటల్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న అనురాధ (30) అనే యువతి, ఉద్యోగానికి వెళుతున్న వేళ, రోడ్డు మధ్య ఏర్పాటు చేసిన అన్నాడీఎంకే జెండా ఉన్నట్టుండి కిందపడింది.

దాన్ని తప్పించే క్రమంలో అనురాధ నడుపుతున్న స్కూటీ అదుపుతప్పి, వేగంగా వస్తున్న లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Tamilnadu
Scooty
AIADMK
Anuradha

More Telugu News